Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నర గంటల్లో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:16 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్... ఈ రెండు ప్రాంతాల మధ్య 235 కిలోమీటర్ల దూరం ఉండగా, ప్రస్తుతం సగటు ప్రయాణ సమయం 6 గంటలకు పైగానే ఉంది.

అతి త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రయాణిస్తే, కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. ఇప్పటికే రెండు నగరాల మధ్య ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు కేంద్రం అనుమతించింది.
 
అయితే, ఈ మార్గంలో 12 కిలోమీటర్ల రహదారిపై మాత్రం జంతువుల సంచారం అధికమని, ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ కారిడార్ గా ఈ మార్గం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ ఎక్స్ ప్రెస్ వే కారణంగా రెండు ప్రాంతాల మధ్య ఉన్న దూరం కూడా 25 కిలోమీటర్లు తగ్గిందని, ఢిల్లీ - షహరాన్ పూర్ - డెహ్రాడూన్ మధ్య ఎకనామిక్ కారిడార్ గా ఇది నిర్మితం కాగా, దూరం 210 కిలోమీటర్లకు తగ్గిందని పేర్కొంది.
 
సాధారణ పరిస్థితుల్లో ఆరున్నర గంటలు పట్టే ప్రయాణం, ఈ రహదారిపై రెండున్నర గంటల్లో పూర్తవుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రహదారిపై 25 కిలోమీటర్ల మేరకు బ్రిడ్జ్ లు ఉన్నాయని, మార్గ మధ్యంలో 14 టన్నెల్స్ ఉంటాయని, ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా, దీన్ని నిర్మించామని వెల్లడించింది.

మార్గమధ్యంలోని కొన్ని ప్రాంతాల్లో భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు తుది దశలో ఉన్నాయని తెలిపింది. మరో రెండేళ్లలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ఆపై ఆర్థికంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంతో లబ్ది పొందుతుందని కేంద్రం పేర్కొంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments