Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకోసమైనా చపాక్ చిత్రం చూస్తా.. కనిమొళి

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:28 IST)
హిందీ సినిమా చపాక్‌పై దుమారం కొనసాగుతోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక యాసిడ్ దాడి బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో విడుదలకు ముందు జేఎన్‌యూ విద్యార్థుల నిరసనల్లో దీపికా పదుకొనే పాల్గొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

దీపికా నటించిన ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ఏబీవీపీ సహా పలు హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ నిరసనల్లో దీపికా ఎలాంటి ప్రసంగాలు చేయకుండా మౌనంగా ఉన్నప్పటికీ విమర్శలు మాత్రం తారస్థాయికి చేరుకున్నాయి. దీనిపై బాలీవుడ్ రెండుగా చీలిపోయింది.

కొందరు దీపికాను సమర్థిస్తే, మరికొందరు ఆమె పబ్లిసిటీ కోసం తపిస్తున్నారనంటూ విమర్శలు చేశారు. మరోవైపు విపక్ష పార్టీల్లో ఎక్కువ మంది దీపికాను సమర్ధిస్తున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆమెకు వత్తాసుగా నిలిచారు. నిజానికి డీఎంకే వారంతా హిందీ వ్యతిరేకులు, హిందీ సినిమాలకు వెళ్లరు.

ఇప్పుడు మాత్రం ఒక మినహాయింపుగా తాను ఛపాక్ సినిమా చూస్తానని కనిమొళి చెప్పారు. పైగా కొన్ని సంస్థలు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని చెప్పడంతో తనలో పట్టుదల పెరిగిందని కనిమొళి అన్నారు. సమాజ్‌వాది పార్టీ అయిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఏకంగా లక్నోలోని ఓ సినిమా థియేటర్‌ను బుక్ చేశారు.

తమ పార్టీ కార్యకర్తలతో కలిసి, కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఛపాక్ ఒక ఆలోచింపచేసే సినిమాగా ఉంటుందని అఖిలేష్ అన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చపాక్ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments