Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్ : ఢిల్లీలో బాణాసంచా లేని దీపావళి

దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా దేశరాజధానిలో టపాసుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:42 IST)
దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా దేశరాజధానిలో టపాసుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. దేశరాజధాని పరిధిలో హోల్‌సేల్‌గా గానీ, రిటైల్‌గా గానీ టపాసులు అమ్మకుండా లైసెన్స్‌లపై నిషేధం విధిస్తూ గతేడాది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని వచ్చే నవంబరు ఒకటో తేదీ వరకు పొడగించింది. 
 
గత సంవత్సరం నవంబరులో ముగ్గురు చిన్నారులు కోర్టుకు లేఖ రాస్తూ, క్రాకర్స్ అమ్మకాలను నిషేధించాలని కోరిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పటాసుల అమ్మకాలపై నిషేధం విధించి, ఆపై వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల విన్నపం మేరకు దాన్ని సవరించింది. తిరిగి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు సాగరాదని తాజాగా ఆదేశించింది. 
 
ప్రతి యేడాది దీపావళి రోజున కాల్చే టపాకాయల కారణంగా వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఎయిర్ క్వాలిటీలో వచ్చే తేడాను సరిగ్గా అంచనా వేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. గత సంవత్సరం కూడా దీపావళి మరుసాడు దట్టమైన పొగ, దుమ్ము, ధూళితో నగరం నిండిపోయిందని ధర్మాసనం గుర్తుచేసింది. 
 
కాగా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సెంట్రల్ పొల్యూషన్ బాడీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సమర్థించాయి. దీంతో ఈనెల 19వ తేదీన దేశ వ్యాప్తంగా ప్రజలు బాణాసంచా కాల్చుతూ దీపావళి జరుపుకుంటే... ఢిల్లీ వాసులు మాత్రం టపాకాయలు పేల్చకుండా దీపావళి జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments