Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు... రేప్ బాధితురాలితో హోం మంత్రి

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (15:29 IST)
మహారాష్ట్రం హోంమంత్రి దీపక్ కేసర్‌కేర్ నోరు జారారు. తనకు న్యాయం చేయాలంటూ వెళ్లి అత్యాచార బాధితురాలి అమర్యాదగా మాట్లాడి దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, గత యేడాది మే నెలలో థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు ఒక మహిళతో పాటు.. ఆమె మైనర్ కుమార్తెను లాక్కెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆరుగురు నిందితులను వదిలివేసి కేవలం ఒక్కరిపైనే కేసు నమోదు చేశారు. 
 
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్‌ను కలిశారు. తనకు న్యాయం చేయాలనే కోరేందుకు వెళితే సాక్షాత్తూ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ తనను దుర్భాషలాడుతూ అమర్యాదగా మాట్లాడారని బాధితురాలు మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
'నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు' అని హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ అన్నారని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అవమానపర్చిన హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధిత మహిళ కోరారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments