Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎంఐ కట్టలేదని కిడ్నాప్ చేశారు... చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జులై 2023 (22:22 IST)
తమిళనాడులో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఫైనాన్స్ కంపెనీ దారుణంగా ప్రవర్తించింది. ఈఎంఐ కట్టలేదని.. సదరు ఫైనాన్స్ కంపెనీ.. ఆతని కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 
 
ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాడు. కానీ ఉద్యోగం పోవడంతో డబ్బుల్లేక నానా తంటాలు పడ్డాడు. అయితే అప్పు తీసుకున్న కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. రాజా ఇంటికి వెళ్లి ఆవేశంలో ఆయన 11ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. 
 
రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన రాజా కుమార్తెను కాపాడి.. విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments