Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో వున్నాయా? డబ్బు కావాలంటే..?

Advertiesment
Vinayaga
, బుధవారం, 28 జూన్ 2023 (13:19 IST)
Vinayaga
ఈ రోజుల్లో మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉన్నప్పటికీ, మనం ఎదుర్కొనే సమస్యలలో 90 శాతం ఆర్థిక సమస్యలే. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో కలిసి ఉంటే ఆ ఇంట డబ్బుకు ఇబ్బంది వుండదు. అవేంటో చూద్దాం.. 
 
గణేశ విగ్రహం: మనం ఏదైనా పని చేసినప్పుడు సాధారణంగా నమస్కరించే ప్రధాన దేవుడు గణేశుడు. అలాంటి వినాయకుడిని నాట్య, నర్తన భంగిమలో వుండే వినాయకుడిని ఇంట్లో వుంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. నాట్య వినాయకుడి విగ్రహాన్ని కొని మీ ఇంటి ద్వారం వైపు ఉండే దిశలో ఉంచితే మీ ఇంట్లో ధన ప్రవాహం రోజురోజుకు పెరిగి ఆర్థిక ఇబ్బందులు పటాపంచలు అవుతాయి. 
 
వేణువు: ధనం, సంపద, బంగారం పోగుచేసుకోవాలంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలి. అలాంటి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే వేణువు వుండితీరాల్సిందే. దీన్ని మీ ఇంట్లో ఉంచితే మీ ఇంట్లో వాస్తుకు సంబంధించిన దోషాలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది.
 
కొబ్బరి: కొబ్బరికాయ ఏదైనా దేవత పూజకు ఉపయోగపడే గొప్ప పదార్థం. ఈ కొబ్బరికాయకు పాజిటివ్ ఎనర్జీని విడుదల చేసే శక్తి ఉంది. ఈ కొబ్బరికాయను ఇంట్లో, కార్యాలయాల్లు వుంచే ఆర్థిక నష్టాలు, కష్టాలు వుండవు. ఇంకా అనేక విధాలుగా ధనం వస్తూనే ఉంటుంది
 
కుబేర విగ్రహం : ఈ ప్రపంచంలోని సమస్త సంపదలకు లక్ష్మి మాత యజమాని కాబట్టి ఈ సంపదలన్నింటినీ రక్షించే ప్రభువు కుబేరుడు. కాబట్టి మీరు సంపదకు అధిపతి అయిన కుబేరుని విగ్రహాన్ని కొనుగోలు చేసి, దానిని మీ ఇంటికి ఉత్తరం వైపు ఈ దిశలో ఉంచినట్లయితే, మీ ఇంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీకు సకల శుభాలు కలుగుతాయి.
 
శంఖం: సాధారణంగా మనం శంఖాన్ని తీసుకుని చెవిలో పెట్టుకుంటే దాని నుంచి వచ్చే ఓం అనే శబ్దం వినబడుతుంది. ఆ శంఖం నుంచి వచ్చే శబ్దం దుష్టశక్తులను నాశనం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శంఖం లక్ష్మీ కటాక్షం నిండిన వస్తువు కనుక ఆ శంఖాన్ని ఇంట్లోని పూజ గదిలో ఉంచితే మీ ఇంట సిరులు కురిసి సకల సంపదలు చేకూరుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-06-2023 బుధవారం రాశిఫలాలు - విద్యాగణపతిని ఆరాధించిన సంకల్ప సిద్ధి