Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధిక రక్తపోటును నిరోధించగల ఉత్తమ ఆహారాలు ఇవే

Advertiesment
Tomato
, గురువారం, 5 జనవరి 2023 (16:02 IST)
అధిక రక్తపోటు ఈరోజుల్లో చాలామందికి వున్న సమస్య. రక్తపోటు సమస్య నుంచి బైటపడేందుకు ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకుంటుంటారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు అధిక రక్తపోను నియంత్రిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ద్రాక్షపండు, నారింజ, నిమ్మకాయలతో సహా పుల్లని పండ్లు రక్తపోటు తగ్గించే శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.
 
చేపలు కొవ్వులకు అద్భుతమైన మూలం, ఇవి గుండె ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
 
గుమ్మడికాయ గింజలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ రక్తపోటు తగ్గించే గుణాలు వున్నాయి.
 
బీన్స్, కాయధాన్యాలలోని ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
 
బెర్రీలు అధిక రక్తపోటును నిరోధించే శక్తి కలిగి వున్నాయి. వీటికి గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించగల సామర్థ్యం వుంది.
 
పిస్తాపప్పులులో పోషకాలు పుష్కలం. ఇవి ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తాయి.
 
క్యారెట్‌లో క్లోరోజెనిక్, కెఫిక్ యాసిడ్‌లు రక్త నాళాలను సడలించడం, వాపును తగ్గించడంలో సాయపడతాయి. రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
 
టొమాటోలులో పొటాషియం, కెరోటినాయిడ్ పిగ్మెంట్ లైకోపీన్‌తో సహా అనేక పోషకాలలో పుష్కలంగా ఉన్నాయి.
 
బచ్చలికూరలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో నిండి వుంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది అద్భుతమైన ఎంపిక

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్ల బట్టలు మెరిసి పోవాలంటే.. ఆస్పిరిన్ మాత్రలను..?