'బర్రె రేస్‌'లో బోల్ట్ రికార్డు బద్ధలు... కన్నడ కుర్రోడి రికార్డు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:15 IST)
ఆధునిక ప్రపంచంలో పరుగులు వీరుడు ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఉస్సేన్ బోల్ట్. ఈ జమైకా టైగర్... ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే అథ్లెట్. వంద మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.58 సెకన్లలో అధికమించి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 
 
ఇపుడు ఆ రికార్డు బద్ధలైపోయింది. కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ(28) బర్రెలతో రన్నింగ్‌ రేస్‌ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాష్ట్రంలోని ఉడుపి, మంగళూరులో బర్రెలతో రన్నింగ్‌ రేస్‌(కంబాలా) అనే సంప్రదాయ పండుగను జరుపుకుంటారు. బురద నేలల్లో ఈ క్రీడను నిర్వహిస్తారు. 
 
అయితే శ్రీనివాస గౌడ తన రెండు బర్రెలతో రన్నింగ్‌ చేస్తూ.. 142.50 మీటర్లను కేవలం 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అంటే 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలో చేరుకుని బోల్ట్‌ కంటే మెరుగ్గా తన ప్రతిభను చాటాడు. 
 
ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ మాట్లాడుతూ.. కంబాలా ఫెస్టివల్‌ అంటే తనకు ఇష్టం. ఈ పండుగలో ప్రతి ఏడాది పాల్గొంటాను. ఈ విజయం తన బర్రెల వల్లే సాధ్యమైంది. ఈ క్రెడిట్‌ బర్రెలదే అని శ్రీనివాస గౌడ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments