Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుమ్రాకు ఏమైంది..? ఇలా బౌలింగ్ చేస్తున్నాడే.. టెస్టుల్లోనైనా రాణిస్తాడా?

Advertiesment
Jasprit bumrah
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (13:10 IST)
టీమిండియా బౌలింగ్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరున్న బుమ్రా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గాయం నుంచి కోలుకుని టీమిండియాలో పునరాగమనం చేసిన బుమ్రా ప్రదర్శనలో తేడా వుందని క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు. 
 
తిరుగులేని వేగంతో గురితప్పకుండా యార్కర్లు సంధించే నాటి బుమ్రాకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యర్థులు అలవోకగా ఎదుర్కొంటున్న ఇప్పటి బుమ్రాకు ఎంతో తేడా కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. వికెట్లు తీయలేకపోవడమే కాదు, అటు పరుగులు సైతం ధారాళంగా సమర్పించుకుంటుండటమే ఇందుకు కారణం. 
 
కాగా కివీస్‌తో జరిగిన తొలి వన్డే పది ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక రెండో వన్డేలో పది ఓవర్లకు బంతులేసిన బుమ్రా 64 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో వన్డేలో పది ఓవర్లేసిన బుమ్రా 50 పరుగులు ఇచ్చాడు. 
 
గతంలో బుమ్రా బౌలింగ్‌ అంటే జడుసుకునే బ్యాట్స్‌మెన్లు ప్రస్తుతం అలవోకగా పరుగులు తీసేస్తున్నారు. ఇంకేముంది.. త్వరలో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లోనైనా బూమ్రా కివీస్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపిస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కివీస్‌ చేతిలో క్లీన్ స్వీప్.. కోహ్లీకి ఏమైంది.. టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు (Video)