గుగూల్ మ్యాప్‌ను నమ్మి కారడవిలో చిక్కున్న కుటుంబం...

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (10:48 IST)
ఓ కుటుంబం దట్టమైన కారడవిలో చిక్కుకుంది. దీనికి కారణం గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ సాయంతో బయలుదేరిన ఓ కుటుంబం అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో వారంతా కారడవిలో రాత్రంతా భయానక జీవితాన్ని గడిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన రాజాస్ రంజిత్ దాస్ కుటుంబం కారులో గోవాకు బయలుదేరింది. ఈ కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని బయలుదేరిన వీరు కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్ దాటిన తర్వాత షిరోడగ, హెమ్మగూడ గ్రామాల మధ్య మీదుగా గూగుల్ మ్యాప్స్ దారి చూపించింది. 
 
దానిని అనుసరించి వెళ్లిన వారు భీమ్‌గఢ్ వైలైఫ్ జోనులో ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఎవరినీ సాయం అర్థించే అవకాశం లేకుండా పోయింది. అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో అటవీ జంతువుల బారినపడకుండా కారును లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
 
తెల్లవారాక వెళ్లిన దారిలోనే వెనక్కి మూడు కిలోమీటర్లు రావడంతో మొబైల్ నెట్‌వర్క్ వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబం వెంటనే పోలీసు హెల్ప్ లైను ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. వెంటనే స్పందించిన బెలగావి పోలీస్ కంట్రోల్ రూం ఖానాపూర్ పోలీసులకు సమాచారం చేరవేసింది. వారు గ్రామస్థులు, జీపీఎస్ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు. 
 
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఇలా అవస్థలు పాలు కావడం ఇదే తొలిసారి కాదు. నవంబర్ 24న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ముగ్గురు కారులో వెళ్తూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తూ రామ్ంగా నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో కారు ఓ కాల్వలోకి దూసుకెళ్లిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments