Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ 8 కేంద్రీయ విద్యాలయాలు.. తెలంగాణాకు నవోదయ స్కూల్స్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణాలో 7 నవోదయ స్కూల్స్ నెలకొల్పనున్నట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు. 
 
వీటిని అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్‌లలో ఏర్పాటు చేయనున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు మంచిపేరుంది. వీటిలో సీబీఎస్ఈ సిలబస్‌తో విద్యాబోధన ఉంటుంది. విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. వీటిని రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకే కేంద్రం సమ్మతం తెలిపింది. 
 
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసే 85 కేంద్రీయ విద్యాలయాల కోసం కేంద్రం రూ.5872 కోట్లను వెచ్చించనుంది. ఈ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వస్తే ఒక్కో పాఠశాలలో 960 మంది విద్యార్థులకు అడ్మిషన్ పొందనున్నారు. 
 
అలాగే, కొత్తగా 28 నవోదయ పాఠశాలల ఏర్పాటుకు 2359.82 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఒక్కో నవోదయ స్కూల్‌లో 560 మంది విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments