Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు రంజన్ గగోయ్... సభ్యత్వాన్ని ఎందుకు స్వీకరించానో వివరిస్తా

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (16:45 IST)
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన న్యాయకోవిదుడుగా గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన్ను రాష్ట్రపతి కోటా నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే.. గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులెవ్వరూ ఇలా రాజ్యసభకు నామినేట్ కాలేదు. కొన్ని దశాబ్దాల క్రితం.. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత పార్లమెంట్‌ సభ్యుడయ్యారు. 1991లో రిటైర్ అయిన ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
 
కానీ, ఇపుడు రంజన్ గగోయ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇపుడుడ ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వివరంగా చెబుతానని జస్టిస్ గొగోయ్ అంటున్నారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "నేను రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొదట నన్ను ప్రమాణ స్వీకారం చేయనీయండి. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడుతా. ఈ సభ్యత్వాన్ని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతా" అని ఆయన తెలిపారు. దాదాపు 13 నెలల పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంజన్‌ గతేడాది నవంబర్‌‌లో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments