సుప్రీం బోనులో కమల్‌నాథ్ భవితవ్యం... విశ్వాసపరీక్ష అప్రజాస్వామ్యం

సోమవారం, 16 మార్చి 2020 (18:32 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. సోమవారం అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్నాథ్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించారు. దీంతో సోమవారం ఎంపీ శాసనమండలిలో విశ్వాస పరీక్ష జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, స్పీకర్ ఎన్.ఆర్ ప్రజాపతి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని, బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. గవర్నర్ ఆదేశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అంటే విశ్వాసపరీక్ష అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే సభను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. 
 
దీంతో బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేవ‌లం 12 గంట‌ల్లోనే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని బీజేపీ ఎమ్మెల్యేల‌ను సుప్రీంను కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. శాసనసభని స్పీకర్ ప్రజాపతి వాయిదావేసిన తర్వాత శివరాజ్ సింగ్ సారథ్యంలోని బీజేపీకి చెందిన 106 మంది ఎమ్మెల్యేలు గవర్నరుతో సమావేశమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
కాగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయింది. జ్యోతిరాదిత్య సింధియా ఇటీవ‌ల క‌మ‌ల్‌నాథ్ టీమ్ నుంచి బ్రేక‌ప్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. దీంతో క‌మ‌ల్ ప్ర‌భుత్వం క‌ష్టాల్లో ప‌డింది. సింధియా వ‌ర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో.. క‌మ‌ల్ ప్ర‌భుత్వ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఈ నేప‌థ్యంలో సోమవారం సీఎం క‌మ‌ల్‌.. బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కోవాల్సి ఉంటే. కానీ స‌భ ప్రారంభం అయిన కొద్ది సేప‌టికి.. క‌రోనా వైర‌స్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో స్పీక‌ర్ సభను 26వ తేదీకి వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా బాధితులు లేరా? ఏం... తమాషాలు చేస్తున్నారా? కేంద్రం సీరియస్