పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో గత రెండు నెలల నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తున్నారు. ఆ నిరసన ప్రదర్శనతో ఢిల్లీలో వాహనరాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆందోళనకారులు రోడ్డుపైన టెంట్లు వేసుకోవడం వల్ల ట్రాఫిక్ జామవుతున్నది. స్థానికంగా చిరు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
అయితే ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటిషన్‌పై వాదోపవాదాలు విన్నది. నిరసన అనేది ప్రాథమిక హక్కు అని, కానీ ఆందోళనకారులు తమ ప్రదర్శన స్థలాన్ని మరో చోటుకు మార్చే వీలు లేదా అని కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. నిరసనకారులను మరో చోటుకు పంపేందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదులను మధ్యవర్తిగా నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.
అడ్వకేట్లు సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్‌లు.. ఆందోళనకారులతో చర్చలు నిర్వహించనున్నారు. నిరసనకారులను మరో ప్రదేశానికి తరలించేందుకు ఆ ఇద్దరూ వారిని ఒప్పించనున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా నిరసనకారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.