రాంగ్ రూటులో వచ్చిన కారు ముందు బైకుతో నిలబడి? (వీడియో)

రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ముందు నిలబడి.. ఆ కారు డ్రైవరుకు చుక్కలు చూపించిన ఓ యువకుడు హీరో అయిపోయాడు. రాంగ్ రూటులో వచ్చిన కారుకు ముందు నిల్చుని.. ఆ కారును అట్టా ఇట్టా కదలాడనీయకుండా చేసిన ఉదంతమంతా.. సీ

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (11:54 IST)
రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ముందు నిలబడి.. ఆ కారు డ్రైవరుకు చుక్కలు చూపించిన ఓ యువకుడు హీరో అయిపోయాడు. రాంగ్ రూటులో వచ్చిన కారుకు ముందు నిల్చుని.. ఆ కారును అట్టా ఇట్టా కదలాడనీయకుండా చేసిన ఉదంతమంతా.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిపోవడం.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే ఈ నెల మూడో తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో సాహిల్ బ‌ట‌వ్ (22) అనే విద్యార్థి ర‌హ‌దారిపై బైక్‌పై వెళ్తుండ‌గా మ‌హీంద్రా థార్ అనే కారు అడ్డదారిలో అతనికి ఎదురుగా వచ్చింది. దీంతో సాహిల్ ఆ వాహ‌నం ఎదుట అలాగే బైక్‌పై ఉన్నాడు. ఎంత‌సేప‌టికీ క‌ద‌ల‌లేదు. అనంత‌రం సాహిల్ బైక్ దిగి ఆ వాహనం నంబ‌ర్ ప్లేట్‌ను ఫొటో తీశాడు. ఆ తర్వాత కారులోంచి దిగిన ఇద్దరు కూడా సాహిల్ బైక్ నెంబర్ ప్లేటును ఫోటో తీశారు. 
 
అయితే ఆ వ్య‌క్తి అంత‌టితో ఆగ‌లేదు. ఏకంగా సాహిల్‌పై దాడికి దిగాడు. కానీ కొంతసేప‌టికే జనాలు చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే సాహిల్ స‌ద‌రు వ్య‌క్తిపై కంప్లెయింట్ ఇవ్వ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. కాగా స‌ద‌రు వ్య‌క్తి సాహిల్‌కు ఎదురుగా రావ‌డం, అనంతరం అత‌న్ని కొట్ట‌డం త‌దితర దృశ్యాల‌న్నీ అక్క‌డే ఉన్న ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. దీంతో ఆ దృశ్యాల‌ను ఎవ‌రో సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఆ వీడియో కాస్తా వైర‌ల్ అయింది. సాహిల్‌ను మెచ్చుకుంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో సాహిల్ హీరో అయిపోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments