Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు మహిళపై అత్యాచారాలు చేసి జైలుకెళ్తారు : ప్రియాంకా గాంధీ

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (14:07 IST)
భారతీయ జనతా పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ విమర్శలు సంధించారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలు చేసి జైలుకెళ్తారనీ, అలాంటి నేతలు దూరంగా పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారత మహిళ బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని కోరారు. మహిళలంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేదన్న ప్రియాంక.. వారిని దూరంగా పెట్టాలన్నారు. 
 
బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుల్దీప్‌సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద, గోపాల్ కందా.. వీరందరూ మహిళలను వేధించిన వారేనని ఆరోపించారు. ఇటువంటి వారిని బహిష్కరించాలని మహిళల కోరారు.
 
ఉన్నావో బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ అరెస్టయ్యాక ఆయనను బీజేపీ సస్పెండ్ చేసిందని, ఆ తర్వాత స్వామి చిన్మయానంద కూడా ఇదే తరహా కేసులో అరెస్టయ్యారని ఆమె గుర్తుచేశారు. 
 
తన విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమన్న ఆరోపణలు ఉన్నాయని ప్రియాంక అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments