ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరుంది. అందుకే సులభంగా ప్రాణాలను తీసేస్తుంది. తాజాగా ఆ ఏనుగు 37 మందిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేఘాలయలోని గరోహిల్స్‌లో ఏనుగు అంటేనే జనం జడుసుకుంటున్నారు. 2016 నుంచి ఈ
ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరుంది. అందుకే సులభంగా ప్రాణాలను తీసేస్తుంది. తాజాగా ఆ ఏనుగు 37 మందిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేఘాలయలోని గరోహిల్స్‌లో ఏనుగు అంటేనే జనం జడుసుకుంటున్నారు. 2016 నుంచి ఈ ఏనుగు ప్రజలను పరుగులు తీసేలా చేస్తుంది. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను తొక్కి చంపేస్తోంది.
తాజాగా ఈ నెల రెండో తేదీన తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది.
సాయంత్రం కాగానే గ్రామాలపై పడడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడాన్ని ఈ లాడెన్ పనిగా పెట్టుకుంది. లాడెన్ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు వెల్లడించారు.