Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 స్టంట్ చేయబోయాడు.. ఏనుగు విసిరికొట్టింది (వీడియో)

బాహుబలి 2 సినిమాలో తొలి పాటలో ప్రభాస్ ఏనుగు తొండంపై నిల్చుంటాడు. అలాంటి స్టంట్‌ను రియల్‌గా చేయాలనుకున్న ఓ యువకుడు చావుకోరలు వరకు వెళ్లొచ్చాడు. ఫలితంగా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఆస్పత్రి పాలైయ్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (11:03 IST)
బాహుబలి 2 సినిమాలో తొలి పాటలో ప్రభాస్ ఏనుగు తొండంపై నిల్చుంటాడు. అలాంటి స్టంట్‌ను రియల్‌గా చేయాలనుకున్న ఓ యువకుడు చావుకోరలు వరకు వెళ్లొచ్చాడు. ఫలితంగా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఆస్పత్రి పాలైయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఇడుక్కి థోడుపూఝాలో బాహుబలి-2లో ప్రభాస్ చేసిన విన్యాసం చేస్తానని.. తన స్నేహితుడ్ని వీడియో తీయాలని కోరాడు. దానికి అంగీకరించిన ఆ యువకుడు వీడియో తీయడం మొదలు పెట్టాడు. దీంతో సాహసం చేయాలనుకున్న యువకుడు ఒక ఏనుగు దగ్గరకి వెళ్లి దానికి అరటిపండు అందించాడు.
 
దానిని అది ఆనందంగా అందుకుంది. తరువాత దాని తలపై సుతారంగా ముద్దు పెట్టాడు. అప్పుడు కూడా మౌనంగా ఉంది. అంతటితో ఆగకుండా.. మెల్లగా దాని దంతాలు పట్టుకుని పైకెక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ఏనుగుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అంతే తొండంతో ఆ యువకుడిని నేలకేసి విసిరికొట్టింది.

క్షణమాగితే ప్రాణాలు పోయేవే.. కానీ వీడియో తీస్తున్న యువకుడు వేగంగా స్పందించి, అతనిని రక్షించి, గాయాలపాలైన అతనిని ఆసుపత్రిలో చేర్చాడు. దీంతో చావుతప్పి చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడు బాహుబలి-2 స్టంట్ ఎలా చేశాడో ఈ వీడియోలో చూడొచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments