Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీకెండ్స్‌లో బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగితే? (video)

వీకెండ్సే కాకుండా టైమ్ దొరికినప్పుడల్లా బిర్యానీకి అలవాటు పడటం.. బిర్యానీకి తోడుగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటుంటే ఇక మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్మే బిర్య

వీకెండ్స్‌లో బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగితే? (video)
, సోమవారం, 6 నవంబరు 2017 (16:29 IST)
వీకెండ్సే కాకుండా టైమ్ దొరికినప్పుడల్లా బిర్యానీకి అలవాటు పడటం.. బిర్యానీకి తోడుగా కూల్ డ్రింక్స్  తాగే అలవాటుంటే ఇక మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్మే బిర్యానీలను తినడం ద్వారా కాలేయానికి ముప్పు తప్పదని.. వారు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలు తినడంతో పాటు కూల్ డ్రింక్స్ తాగినట్లైతే.. పొట్టలోకి పేగుల ద్వారా గ్యాస్ చేరుతుందని.. తద్వారా అసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.  
 
వీకెండ్‌లో లొట్టలేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ లాగించడం ద్వారా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. అలాగే వారాంతంలో ఆల్కహాల్ తీసుకునే వారిలో మాత్రమే కాలేయ సమస్యలు వస్తాయనుకోకూడదు. అదేపనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినే వారిలో కూడా ఈ కాలేయ సంబంధిత వ్యాధులు తప్పవు. వీకెండ్స్‌లో నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువగా తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాలేయ రుగ్మతలతో సతమతమవుతున్నారని ఇప్పటికే పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
ఇలా బిర్యానీలు తినే అలవాటున్న వారిలో ఛాతినొప్పి, నీరసం, ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి బిర్యానీ తయారీకి వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడమే కారణం. ఇంకా నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం ద్వారా కాలేయ సమస్యలు తప్పవు. ముఖ్యంగా రెస్టారెంట్లలో బిర్యానీ తినే సమయంలో దానితో పాటు కూల్ డ్రింక్ కూడా తీసుకోవడం ఫ్యాషనైపోయిందని.. ఆ అలవాటుతో కాలేయ సమస్యలు, ఒబిసిటీ, హృద్రోగ వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
బిర్యానీ తినాలనుకుంటే ఇంట తయారీ చేసిందైతే మంచిదని.. వాటికి తోడుగా కూల్ డ్రింక్స్ కాకుండా గోరువెచ్చని నీటిని తాగితే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. బిర్యానీలు, పిజ్జా వంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. అదే సోడాతో కూడిన డ్రింక్స్ తాగడం ద్వారా వాటిలోని ఫాస్పరిక్ యాసిడ్, సోడియం, ఫ్రూక్టోస్, అధిక కేలరీల ద్వారా ఒబిసిటీ, డయాబెటిస్, శరీరంలో క్యాల్షియం తగ్గిపోవడం వంటి ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. పాలకూరను.. ఆక్రోట్లను తీసుకోండి