Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చినుకులు పడుతున్నాయ్.. వేడి వేడిగా చికెన్ పులావ్ టేస్ట్ చేయండి..

బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరంమసాల పొడి, పుదీనా పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక అరగంట పక్కనబెట్

Advertiesment
చినుకులు పడుతున్నాయ్.. వేడి వేడిగా చికెన్ పులావ్ టేస్ట్ చేయండి..
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:36 IST)
చికెన్ బిర్యానీ చేసి బోర్ కొట్టేసిందా.. అయితే చికెన్ పులావ్ ట్రై చేయండి. బరువును నియంత్రించే చికెన్‌తో వర్షాకాలంలో హాట్ హాట్‌గా చికెన్ పులావ్ టేస్ట్ చేయండి.. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్ధాలు:
బాస్మతి రైస్ - అరకేజీ 
చికెన్- అరకేజీ 
గరంమసాలాపొడి - మూడు టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్- మూడు టీ స్పూన్లు 
ఉప్పు, పసుపు, కారం, నూనె- తగినంత 
లవంగాలు, చెక్క, యాలకులు - ఒక స్పూన్
బిర్యానీ ఆకులు - రెండు
ఉల్లి తరుగు - ఒక కప్పు 
పచ్చిమిర్చి తరుగు- పావు కప్పు 
టమోటా తరుగు - ఒక కప్పు 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
పుదీనా ఆకులు - అర కప్పు 
పెరుగు- అర కప్పు 
 
తయారీ విధానం : 
బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరంమసాల పొడి, పుదీనా పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక అరగంట పక్కనబెట్టాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆపై టమోటా ముక్కలు వేసి ఉడికిన తర్వాత చికెన్ మిశ్రమం కలపాలి. 
 
చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలా పొడి వేసి కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. పది నిమిషాల తర్వాత కుక్కర్లో రెడీ అయిన చికెన్ పలావును వేడి వేడిగా పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాల్చినచెక్క పొడితో పుష్టిగా వృద్ధి...