Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం - ఆ పార్టీలకు జాతీయ హోదా రద్దు.. బీఆర్ఎస్‌కు షాక్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:47 IST)
భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేసింది. అలాగే, భారత రాష్ట్ర సమితికి కూడా తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీని తెలంగాణ ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. పైగా, ఏపీలో ఆ పార్టీకి జాతీయ హోదాను రద్దు చేసింది. అదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం జాతీయ హోదాను కల్పించింది. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఎన్సీపీలు ఉన్నాయి. ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఈ పార్టీల నేతల తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఆప్ విషయానికి వస్తే ఢిల్లీలో పురుడు పోసుకున్న ఈ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. 
 
ముఖ్యంగా, గత యేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఏకంగా ఐదు చోట్ల విజయం సాధించి, తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ బరిలో దికిన తొలిసారే ఏకంగా ఐదు స్థానాల్లో గెలుపొందడం సాధారణ విషయం కాదు. మరోవైపు, సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు జాతీయ హోదాను రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీల నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. మరోవైపు, ఏపీలో భారత రాష్ట్ర సమితికి జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments