Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కౌ హగ్ డే'‌పై వెనక్కి తగ్గిన కేంద్రం.. ఉత్తర్వులు జారీ

cow hug day
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:40 IST)
ఈ నెల 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే)ను నిర్వహిస్తుంటారు. అయితే, ఆ రోజును "కౌ హగ్ డే"‌గా జరుపుకోవాలని గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. జంతు సంక్షేమ బోర్డు ఉపసంహరించుకుంది. 
 
కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నాం' అని బోర్డు కార్యదర్శి ఎస్‌కే దత్తా పేర్కొన్నారు.
 
కాగా, వాలంటైన్స్ డే రోజున రోడ్డుపై కనిపించే ప్రేమ జంటలకు బంజరంగ్‌ దళ్ వంటి హిందూ సంస్థ కార్యకర్తలు బలవంతంగా పెళ్లిళ్లు చేయడంతోపాటు వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, ఫిషరీస్ మంత్రి పరసోత్తమ్‌ రూపాలా నేతృత్వంలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) బుధవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. 
 
పశ్చిమ సంస్కృతి విస్తృతి వల్ల భారతీయ వేద సంప్రదాయాలు అంతరించిపోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా జరుపుకోవాలని సూచించింది. దీని వల్ల భావోద్వేగ గొప్పతనం తెలియడంతోపాటు వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని పేర్కొంది.
 
మరోవైపు జంతు సంక్షేమ బోర్డు జారీ చేసిన ఈ ఉత్తర్వుపై విమర్శలు వచ్చాయి. గోమాత అయిన ఆవును ఆ ఒక్క రోజే హగ్‌ చేసుకుని గౌరవించాలనడం తగదంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌తో సహా పలువురు నేతలు మండిపడ్డారు. ఆవును ఎల్లప్పుడూ ప్రేమించవచ్చంటూ సోషల్‌ మీడియాలో కూడా పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పది : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత