Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ఇంట్లో 10 వేల విదేశీ వాచ్‌లు... రోజుకొకటి పెట్టుకున్నా 27 యేళ్లపాటు...

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:38 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారుల తనిఖీల్లో బహిర్గతమవుతోంది. 
 
ముఖ్యంగా, మోడీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయగా, దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొన్ననే రూ.వంద కోట్ల విలువైన విదేశీ కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు ఆయన ఇంట్లోని ఓ గదిలో ఉన్న వాచీలను చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10 వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. 
 
ఈ వాచీలను రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ వాచీలను 60 ప్లాస్టిక్ కంటైయినర్లలో భద్రపరిచి ఉంచారు. ఈ వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments