తొలి రోజు 10 గంటల విచారణ - రెండో రోజు 11 గంటలు... నేడు కూడా

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (09:16 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడో రోజు అయిన బుధవారం కూడా విచారణ జరుపనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సోమవారం నుంచి వరుసగా విచారణకు హాజరవుతున్నారు. 
 
రెండో రోజైన మంగళవారం ఏకంగా 11 గంటల పాటు విచారణ జరిగింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి బ్రేక్ ఇచ్చారు. భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటల వరు ఏకబిగువున రాహుల్ వద్ద విచారణ జరిగింది. 
 
రెండు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. అంటే ఈ లిఖిత పూర్వక సాక్ష్యాధారాలుగా ఈడీ అధికారులు పరిగణించే దిశగా ఈడీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, మూడో రోజైన బుధవారం కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారణకు రావాలని ఆదేశించారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు వారు రాహుల్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. ఫలితంగా ఆయన మంగళవారం కూడా ఈడీ కార్యాలయానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments