Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లో ఇక సేవ్ చేసుకుని మెసేజ్ పంపాల్సిన అవసరం లేదు..

Advertiesment
whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్ వాడే వారు కొత్త నంబర్ దేనికి అయినా వాట్సాప్ చేయాలంటే.. కాంటాక్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకుని మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. 
 
సాధారణంగా వాట్సాప్ చేయాల్సిన ప్రతీ నంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో చేర్చుకోవడం వల్ల జాబితా పెద్దది అయిపోతుంది. కొన్ని నంబర్లను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. 
 
అందుకే దీనికి ఓ పరిష్కారం ఉంది. కొత్త నంబర్, దాన్ని కాంటాక్టుల జాబితాలో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా వాట్సాప్ చేయవచ్చు. ముందు మీ ఫోన్ లో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. 
 
బ్రౌజర్ సెర్చ్ బార్ లేదా యూఆర్ఎల్ బార్ లో https://wa.me/91 అని టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా ఫోన్ నంబర్ యాడ్ చేసి సెర్చ్ ఓకే చేయడం ద్వారా  వెంటనే వాట్సాప్ యాప్ ఓపెన్ అయ్యి సదరు ఫోన్ నంబర్‌తో మెస్సేజ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆపై ఆ నంబర్ కు వాట్సాప్ చేసుకోవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ మూన్‌లా స్ట్రాబెర్రీ మూన్.. అంటే ఏమిటి?