Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన.. రూ.6వేల సాయం? నమ్మొచ్చా?

Advertiesment
Jobs
, గురువారం, 9 జూన్ 2022 (20:02 IST)
ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన' కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 6,000 సహాయం అందిస్తోందని వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. 
 
కానీ ఫ్యాక్ట్ చెక్‌లో కేంద్రం అలాంటి  ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని స్పష్టం చేసింది. చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ఏదీ అమలు చేయడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని పీఐబీ కోరింది.
 
దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలనెల రూ.6వేలు ఇవ్వనుంది. ప్రధాన్‌ మంత్రి బెరోజ్‌గర్ భట్టా యోజన 2022' కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 6,000 లభిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 
 
అయితే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై వాస్తవ తనిఖీని నిర్వహించింది. ఇందులో ఈ వార్తలో నిజం లేదని తేలింది. 
 
జనాలు సోషల్‌ మీడియాలో వచ్చింది ఏదిపడితే అది నమ్మవద్దని సూచించింది. ఈ రోజుల్లో సోషల్‌ మీడియాను ఆసరా చేసుకుని మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అప్రమత్తంగా వుండాలని పేర్కొంది.  ఇంకా సోషల్‌ మీడియాలో వచ్చిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయరాదని సూచించింది.
 
ప్రభుత్వ విధానాలు/పథకాలపై తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం కోసం... 
 
మీ ఎంక్వైరీలను +918799711259 అనే నెంబర్ లేదా socialmedia@pib.gov.in అనే వెబ్ సైట్‌కు పంపండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిసాన్ యోజన.. అకౌంట్‌లో డబ్బులు పడలేదంటే ఇలా చేయండి..