Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్కారుపై దుష్ప్రచారానికి చెక్ పెట్టేలా వాట్సాప్‌పై ఏపీ సర్కారు డీల్

andhra pradesh map
, శుక్రవారం, 10 జూన్ 2022 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుంది. ఇప్పటికే ప్రకటనల పేరుతో సొంత మీడియాకు కోట్లాది రూపాయలు అందజేస్తుంది. ఇపుడు వాట్సాప్‌తో ఓ సరికొత్త ఒప్పందాన్ని కుదుర్చకుంది. ప్రభుత్వంపై సాగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 
 
ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి గురువారం రాత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పని చేయనుందని ఆయన వెల్లడించారు. 
 
ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పని చేయాల్సివుంటుందని వాసుదేవ రెడ్డి తెలిపారు. అలాగే, ప్రభుత్వ కార్యక్రమాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయంతో పాటు ఈ ఒప్పంద ద్వారా ఎలాంటి ప్రయోజన దక్కనుందన్న విషయంపై వాసుదేవ రెడ్డి తెలుగుతో పాటు ఇంగ్లీషులో ఓ ప్రకటన విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో తగ్గుతున్న వంట నూనెల ధరలు