Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ ముందుకు జమ్మూ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా.. కాషాయ పార్టీని..?

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:03 IST)
omar
జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఈడీ ముందుకు వచ్చారు. ఈడీ ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్ధుల్లా వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
జమ్మూ క‌శ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమ‌ర్ అబ్దుల్లాపై కూడా ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒమ‌ర్ అబ్దుల్లాను విచారించినట్టు స‌మాచారం. 
 
ఈ వ్యవహారంలో తన వైపు నుండి ఎటువంటి తప్పు లేనందున సహకరిస్తానని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒమర్ అబ్ధుల్లా రాశారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ నిలబడినా, కేంద్ర ఏజెన్సీలు తమపై అధికార "దుర్వినియోగం" చేస్తున్నాయని అన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం అలవాటు చేసుకుందని, అదే దిశలో ఇది మరో ముందడుగు అని ఒమర్ మండిపడ్డారు. 
 
బీజేపీకి అర్థవంతమైన వ్యతిరేకతను వ్యక్తం చేసే ఏ రాజకీయ పార్టీని కూడా వదిలిపెట్టలేదని, అది ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ అయినా సరే, ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఎన్సీ తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments