Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున వరుస భూకంపాలు.. వణికిపోయిన జనాలు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (14:41 IST)
దీపావళి రోజున వరుస భూకంపాలు జనాలను వణికించాయి. వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
 
ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్‌తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదైంది. 
 
దాని ప్రభావం ఈశాన్యంతో పాటు పశ్చిమ బెంగాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. దీని తర్వాత మధ్యాహ్నంలోపు మరో 10 భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత మొదటిదాని కంటే తక్కువగానే నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments