తప్పతాగి కారు నడిపిన యువతి.. ఇద్దరు స్టూడెంట్లు దుర్మరణం.. ఎక్కడ?

మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో వున్న యువతి కారుపై నియంత్రణ కోల్పో

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (10:27 IST)
మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో వున్న యువతి కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 
 
హడ్సన్ లైన్స్‌ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని తప్పతాగి బండి నడిపిన యువతి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఇద్దరు స్టూడెంట్లు రితేశ్ దహియా, సిద్దార్థ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
 
స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కారు బోల్తా పడిందని.. డీసీపీ అస్లాం ఖాన్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం నిందితురాలిని అరెస్టు చేశామని అస్లాం ఖాన్ తెలిపారు. తప్పతాగి బండి నడిపిన యువతికి లెర్నల్ లైసెన్స్ వుంది. వారంతా నోయిడాలోని అమితీలో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments