Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీపై అంత విశ్వాసం వుంటే.. ఇక అవిశ్వాసం ఎందుకయ్యా?: బాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీపై అంత విశ్వాసం వుంటే ఇక అవిశ్వాసం పెట్టడం ఎందు

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (09:00 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీపై అంత విశ్వాసం వుంటే ఇక అవిశ్వాసం పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పార్లమెంట్ వేదికగా చేపట్టాల్సిన నిరసనలు, కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలన్న అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా వైకాపాపై చంద్రబాబు మండిపడ్డారు. మోదీపై కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓ వైపు విశ్వాసం, మరోవైపు అవిశ్వాసం అంటూ డొంకతిరుగుడు మాటలెందుకని ధ్వజమెత్తారు. హోదా విషయంలో టీడీపీ వైఖరి సుస్పష్టమని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని బాబు తెలిపారు.
 
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే.. బీజేపీతో పొత్తు వుంటుందా? వుండదా? చెప్పాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో లాలూచీ పడిన జగన్, ఇప్పటికే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
 
కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వంత పాడుతున్నాడని మండిపడ్డారు. వైకాపా ప్రజా సెంటిమెంట్‌తో ముడిపడిన ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేస్తోందని, అందుకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రత్తిపాటి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments