ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ దుజానా హతం

Webdunia
గురువారం, 4 మే 2023 (17:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ దుజానాను యూపీ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇక్కడి మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై 18 హత్యలతోపాటు దోపిడీలు, భూకబ్జాలు తదితర నేరాలకు సంబంధించి 62 వరకు కేసులున్నాయి. 
 
అలాగే, అతడిపై బులంద్‌శహర్ పోలీసులు రూ.25 వేలు, నోయిడా పోలీసులు అతనిపై రూ.50 వేల రివార్డు ప్రకటించారు. ఓ హత్య కేసులో ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనిల్... తనపై కేసుల్లోని సాక్షులను బెదిరించినట్లు సమాచారం. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
మరోవైపు, ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో ఇటీవలే గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, మరో నిందితుడు గుల్హామ్‌లు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. తదనంతరం అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా అనిల్‌ దుజానా ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments