Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మర్డర్ మిస్టరీ ఛేదించిన థాయ్ పోలీసులు.. 12 మందిని చంపేసిన గర్భవతి

మర్డర్ మిస్టరీ ఛేదించిన థాయ్ పోలీసులు.. 12 మందిని చంపేసిన గర్భవతి
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (13:05 IST)
ఇటీవల జరిగిన ఓ హత్య కేసు వెనుక ఉన్న మర్మాన్ని థాయ్‌లాండ్ పోలీసులు ఛేదించారు. ఓ మహిళ తన స్నేహితురాలినే అంతమొందించింది. ఆమెను పోలీసులు విచారించగా మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరో 11 మరణాల వెనుక కూడా ఆమె హస్తం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పైగా, ప్రస్తుతం ఆ మహిళ గర్భవతి కావడం గమనార్హం. 
 
ఆమె ఏకంగా 12 మందిని చంపారన్న విషయం థాయ్‌లాండ్ పోలీసులను విస్తుగొలిపేలా చేసింది. మృతులంతా ఆమె స్నేహితులే కావడం గమనార్హం. వీరందరినీ సైనేడ్‌తోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
ఆ గర్భవతి పేరు సరారత్ రంగ్ సివుతాపోర్న్. వయసు 32 సంవత్సరాలు. స్నేహితురాలి హత్య కేసులో మంగళవారం నాడు పోలీసులు ఆమెను బ్యాంకాక్‍‌లో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ నెల 14వ తేదీన తన స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్వోంగ్‌తో కలిసి సివుతాపోర్న్ రచాబురి ప్రావిన్స్‌కు విహార యాత్రకు వెళ్లింది. ఓ నది వద్ద ఇద్దరూ బౌద్ధమత ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, సిరిపోర్న్ ఖాన్వోంగ్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మృత్యువాతపడింది. 
 
ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, శరరీంలో సైనేడ్ ఉన్నట్టు తేలింది. పైగా, మృతురాలి ఫోన్, డబ్బులు, హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. 
 
దీంతో పోలీసులు రంగ్ సివుతాపోర్న్‌ను అనుమానించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. గత 2020 నుంచి 2023 ఏప్రిల్ మధ్య కాలంలో 33 నుంచి 44 యేళ్ల మధ్య వయసు ఉన్నవారిని హత్య చేసింది. వీరంతా ఒకే రీతిలో చనిపోయారు. వీరిలో రంగ్ సివుతాపోర్న్ బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. 
 
ఇదిలావుంటే, నిందితురాలు ఓ పోలీస్ అధికారి మాజీ భార్య. తాను ఎలాంటి నేరం చేయలేదని నిర్ధోషినని వాదిస్తుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని గంటల కొద్దీ పోలీసు విచారణతో ఆమె ఒత్తిడికి గురవుతుందని చెప్పారు. ఇపుడు 11 మంది మరణాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించేందుకు పోలీసులు నడుంబిగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తండ్రి చేసిన పని.. పచ్చబొట్టు చెరగడం కోసం.. చిన్నారుల చర్మాన్ని?