Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్యకు ముందు.. తర్వాత.. కోర్టుకు ఫోన్ కాల్స్ వివరాలు

Webdunia
గురువారం, 4 మే 2023 (16:36 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ముందు ఆ తర్వాత కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు అనేక పలువురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఫోన్ కాల్స్‌ను సీబీఐ బహిర్గతం చేసింది. ఈ వివరాలను హైకోర్టుకు ఒక కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం నుంచి మార్చి 15వ తేదీ వరకు ఫోన్ కాల్స్ వివారలను వెల్లడించింది. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిల మధ్య సంభాషణ వెల్లడించింది. అలాగే, అవినాష్, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలను కూడా బహిర్గతం చేసింది. వీరిలో సునీల్ యాదవ్ - దస్తగిరి మధ్య అత్యధిక ఫోన్ కాల్స్ జరిగాయి. 
 
* వైఎస్ అవినాశ్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6.18 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ చేశారు. 
* ఉదయ్ కుమార్ రెడ్డి మార్చి 14న రాత్రి గం.9.12 నిమిషాలకు, ఆ తర్వాత మార్చి 15న ఉదయం గం.6.10 నిమిషాలకు... రెండుసార్లు వైఎస్ అవినాశ్ కు ఫోన్ చేశాడు.
* శివశంకర్ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం గం.5.58 నిమిషాలకు వైఎస్ అవినాష్‌కు ఫోన్ చేశాడు. మార్చి 14న సాయంత్రం నుండి రాత్రి వరకు మూడుసార్లు ఫోన్ చేశాడు.
* గంగిరెడ్డి మార్చి 14న రాత్రి గం.8.02 నిమిషాలకు, మార్చి 15న ఉదయం మరోసారి శివశంకర రెడ్డికి ఫోన్ చేశాడు.
* గంగిరెడ్డి మార్చి 14న రెండు సార్లు సునీల్ యాదవ్ కు ఫోన్ చేశాడు. 
* ఉమాశంకర్ రెడ్డి మార్చి 15న ఉదయం గంగిరెడ్డికి ఒక ఫోన్ కాల్ చేశాడు.
* ఉమాశంకర్ రెడ్డి ఐదుసార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. 2 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. సునీల్ యాదవ్ కూడా రెండుసార్లు ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు.
* షేక్ దస్తగిరి మూడుసార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. 22 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. 
* సునీల్ యాదవ్ రెండుసార్లు షేక్ దస్తగిరికి ఫోన్ చేశాడు. 4 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments