Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే.. ఇక ఆ బాధ లేదు.. పరికరం వచ్చేసింది..?!

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:19 IST)
DRDO
కరోనా వచ్చిన వారు ఆసుపత్రిపాలు కాకుండా ఉండాలి అంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని ఆక్సిజన్ మోతాదును పల్స్ అక్షీమీటర్‌తో గుర్తించవచ్చు.. కానీ ఒకేసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి.
 
అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఆ సమస్యకు పరిస్కారం దొరకనుంది. దేశ సరిహద్దుల్లో ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో ఓ పరికరం తయారు చేసింది. కాగా ఈ పరికరాన్ని బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన 'ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ' తయారుచేసింది. దీనికి 'ఎస్‌పీవో-2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం' పేరుపెట్టారు.
 
ఈ పరికరానికి ఒక లీటర్‌ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్‌ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్‌డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కరోనా బాధితులకు వరంలా మారనుంది. ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్‌ను గుర్తించి తక్కువ ఉంటే తగిన మోతాదులో అందిస్తుంది.
 
ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానంగా ఉండే ఈ పరికరం కరోనా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments