Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం... విడాకుల మాటెత్తగానే అడ్డంగా నరికేసిన డాక్టర్ భర్త!

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (10:14 IST)
అతనో వైద్యుడు. ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు కోరింది. అంతే.. ఆవేశంతో ఊగిపోయిన భర్త... ఆమెను మట్టుబెట్టాడు. అంతటితో కోపం చల్లారకపోవడంతో కారుతో ఆమె కడుపుపై ఎక్కించి మరీ చంపేశాడు. అడ్డొచ్చిన మామపై కూడా దాడిచేశాడు. ఈ దారుణం కోయంబత్తూరు జిల్లా కొళత్తూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌కుమార్‌(40) కాటాన్‌ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్నాడు. మరో ప్రైవేటు ఆస్పత్రిలో  పనిచేస్తున్న సమీప బంధువు కీర్తనను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. 
 
చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కృష్ణప్రియనగర్‌లో నివాసం ఉంటున్న కీర్తన తల్లి కుమారి, తండ్రి మురహరి ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా తొలుత గోకుల్‌ కుమార్‌ ఉండేవాడు. ఇటీవల కీర్తనతో అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్‌ కుమార్‌ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అడ్డొచ్చిన మామ మురహరిపై దాడి చేశాడు. కీర్తనను విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి బయటకు లాక్కొచ్చి, కారుతో ఆమెపై దూసుకెళ్లి హతమార్చేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు.
 
దీనిపై సమాచారం అందుకున్న మధురాంతకం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ మురహరిని ఆస్పత్రికి, కీర్తన మృత దేహాన్ని మార్చురికి తరలించారు. కాగా, జాతీయ రహదారిలో కారులో తప్పించుకెళ్తున్న సమయంలో గోకుల్‌కుమార్‌ ప్రమాదానికి గురయ్యాడు. టోల్‌గేటు వద్ద కారు బోల్తాపడడంతో గాయపడి, చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments