Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తండ్రి పేరు కాదు.. మీ తండ్రుల పేరు పెట్టుకోండి.. రెబెల్స్‌కు సీఎం ఉద్ధవ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (18:07 IST)
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వినియోగించడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి గౌహతిలో క్యాంపు శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శనివారం కొత్త పార్టీని స్థాపించారు. దీనికి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నారు. 
 
దీనిపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వాడరాదన్నారు. మీ తండ్రుల పేరుతో పార్టీని స్థాపించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ తండ్రు పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని ఆయన సవాల్ విసురుతూ బాల్‌ ఠాక్రే పేరును వాడొద్దని హెచ్చరించారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు శివసేన జాతీయ కార్యవర్గం శనివారం మరోమారు సమావేశమైంది. ఇందులో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments