Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్ధవ్ ఠాక్రే: ‘నేను సీఎంగా వద్దని ఎమ్మెల్యేలు కోరుకుంటే నా సామాన్లు సర్దుకుని వెళ్లిపోవటానికి సిద్ధం’

Advertiesment
Uddhav
, బుధవారం, 22 జూన్ 2022 (18:28 IST)
‘‘నేను ముఖ్యమంత్రిగా కొనసాగవద్దని ఏ ఎమ్మెల్యే అయినా కోరుకుంటున్నట్లయితే.. వర్ష బంగళా(ముఖ్యమంత్రి అధికార నివాసం)లో నా వస్తువులన్నీ సర్దుకుని మాతోశ్రీకి వెళ్లిపోవటానికి నేను సిద్ధం’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార శివసేన పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

 
‘‘నా సొంత వాళ్లే(ఎమ్మెల్యే) నన్ను వద్దనుకుంటే నేనేం చెప్పగలను? వారికి నామీద ఏమైనా వ్యతిరేకత ఉన్నట్లయితే ఇదంతా సూరత్ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్లు నా దగ్గరకు వచ్చి నా ముందే ఇది చెప్పి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

 
మీరు చెప్తే సీఎం పదవి వదిలిపెట్టటానికి నేను సిద్ధం. ఇది నంబర్ల గురించి కాదు. ఇది నన్ను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారనే దాని గురించి. ఒక్క ఎమ్మెల్యే అయినా సరే నన్ను వ్యతిరేకిస్తున్నట్లయితే నేను వెళ్లిపోతా. కనీసం ఒక్క ఎమ్మెల్యే నన్ను వ్యతిరేకించినా కూడా అది నాకు చాలా అవమానరం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి పదవి వస్తుంది, పోతుంది. కానీ నిజమైన సంపద ప్రజల అభిమానం. గడచిన రెండేళ్లలో ప్రజల నుంచి ఎంతో అభిమానం సంపాదించుకోగలగటం నా అదృష్టం’’ అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం - కనీసం 920 మంది మృతి, 600మందికి గాయాలు