Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృత్వానికి మచ్చతెచ్చేలా వ్యాఖ్యలు.. డీఎంకే నేత ఏ.రాజాకు షోకాజ్ నోటీస్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (11:38 IST)
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత ఏ.రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు బుధవారం సాయంత్రంలోగా ఆరు గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాజాను ఈసీ ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. షోకాజ్‌ నోటీసులు ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది.
 
ఇటీవల థౌజండ్‌లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన రాజా.. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారపార్టీ నేతలు రాజాపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
 
సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం ఈపీఎస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్టుగా ఉన్నాయని ఈసీ ఆ నోటీసులో పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికే వస్తాయని, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, పళనిస్వామిపై చేసిన వ్యాఖ్యలకు రాజా ఇప్పటికే క్షమాపణలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments