Webdunia - Bharat's app for daily news and videos

Install App

"హర్ ఘర్ తిరంగా" ప్రచార వెబ్‌సైట్... 5 కోట్ల సెల్ఫీలు అప్‌‍లోడ్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:30 IST)
భారత 75వ వజ్రోత్సవ వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా వాడవాడలా జరిగాయి. ప్రతి ఒక్క పౌరుడుతో పాటు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అదేసమయంలో ఈ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రారంభించిన ప్రచారం వెబ్‌సైట్ త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. ఏకంగా ఐదు కోట్ల సెల్పీలు ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో జాతీయ జెండాతో తమ సెల్ఫీలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో తమవంతు భాగస్వాములయ్యారు. 
 
ఇది అద్భుతమైన విజయంగా పేర్కొంటూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకుంది. ఈ విజయం భారతదేశ ఐక్యత మరియు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. 
 
స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమతమ గృహాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇది 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలా సాగాలని కోరారు. ఈ పిలుపునకు స్పందించిన దేశ ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో తమ ఇళ్లముందు ఎగురవేసిన జాతీయ జెండాలతో దిగిన సెల్ఫీలను తీసి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
ప్రచారాన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నోడల్ ఏజెన్సీ, ప్రజలు తమ జెండాతో సెల్ఫీలు తీసుకుని ప్రచార వెబ్‌సైట్ www.harghartirang.comలో అప్‌లోడ్ చేసే వెసులుబాటును కల్పించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments