Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీప్రీత్ సింగ్ దొరకలేదట..

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రామ్‌రహీం జైలుకు వెళ్లిన తరువాత బాబా ప్రధాన సహచరి హనీప

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (09:11 IST)
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రామ్‌రహీం జైలుకు వెళ్లిన తరువాత బాబా ప్రధాన సహచరి హనీప్రీత్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా నేపాల్ పోలీసులు హనీప్రీత్ పోలికలు కలిగిన ఒక యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి తరువాత విడిచిపెట్టేశారు. 
 
నేపాల్‌లోని ధరానా వార్డు 13లోగల సెవారో సెకువా కార్నర్‌లో ఇండియన్ నెంబర్ కలిగిన లగ్జరీ వాహనంలో హనీప్రీత్ పోలికలు కలిగిన ఒక యువతి పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హనీప్రీత్ ఆచూకీ లభ్యమైందని వార్తలు వచ్చాయి. 
 
అయితే పోలీసుల విచారణలో ఆమె హనీప్రీత్ సింగ్ కాదని తేలింది. కాగా పోలీసులు ఆమె వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఆమె బీహార్‌లోని పాట్నాకు చెందిన యువతి అని, ఫ్యామిలీతో నేపాల్‌ను దర్శించేందుకు వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments