Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా బుద్ధి మారదా? దక్షిణాసియాలోకి చొరబడేందుకు..?

చైనా బుద్ధి మారేలా లేదు. మరోసారి తన వంకర బుద్ధిని చైనా బయటపెట్టింది. దక్షిణాసియాలోకి చొరబడేందుకు నేపాల్ సరిహద్దులను కలిపే.. టిబెట్‌లోని జాతీయ రహదారిని పున:ప్రారంభించింది. టిబెట్‌లోని జిగాజే విమానాశ్రయ

Advertiesment
చైనా బుద్ధి మారదా? దక్షిణాసియాలోకి చొరబడేందుకు..?
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:57 IST)
చైనా బుద్ధి మారేలా లేదు. మరోసారి తన వంకర బుద్ధిని చైనా బయటపెట్టింది. దక్షిణాసియాలోకి చొరబడేందుకు నేపాల్ సరిహద్దులను కలిపే.. టిబెట్‌లోని జాతీయ రహదారిని పున:ప్రారంభించింది. టిబెట్‌లోని జిగాజే విమానాశ్రయం నుంచి సిటీ సెంటర్ వరకు 40.4 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు ఉన్న హైవేని తెరిచినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కేవలం పౌర రవాణా అవసరాల కోసమే ఈ హైవేను పున:ప్రారంభించామని చైనా చెబుతున్నా... దీని వెనుక వ్యూహాత్మక నిర్ణయం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 
 
కాగా ఇంతకుముందు సిక్కిమ్ సరిహద్దుల్లో ఉన్న డోక్లామ్ ప్రాంతంలో రోడ్డును నిర్మించతలపెట్టి.. భారత్ ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన చైనా.. ప్రస్తుతం దక్షిణాసియాలోకి చొరబడేందుకు ఈ జాతీయ రహదారిని ప్రారంభించింది.
 
మరోవైపు ప్రపంచ శాంతి - భద్రత విషయాల్లో అమెరికా - జపాన్‌లతో భారత్ బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇది చైనాకు మింగుడు పడడం లేదు. ఈ మూడు దేశాలు ఇలా ముడి వేసుకుంటే.. భవిష్యత్తులో తన ఎత్తులు పారవని - భారత్‌పై కాలు దువ్వేందుకు ఛాన్స్ ఉండదనుకుంటున్న చైనా.. ప్రస్తుతం వెనక్కి తగ్గి భారత్‌కు కొన్ని సూచనలు చేసింది. 
 
అమెరికాతో కలిసి జపాన్.. భారత్‌ను తప్పుదోవ పట్టిస్తోందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాను జపాన్ నేరుగా ఎదుర్కోలేక భారత్‌ను ఓ పావులా వాడుకుంటోందని చైనా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తె ప్రవర్తన సరిగాలేదనీ గొంతుపై కాలేసి తొక్కిచంపేశారు...