Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు... కనిపిస్తే కాల్చివేత

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:47 IST)
ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 13 మంది  ప్రాణాలు కోల్పోవడం. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడం, 48 మంది పోలీసులకూ గాయాలు అవడంతో స్పెషల్ పోలీస్ కమిషనర్‌గా 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఎస్ఎన్ శ్రీవాత్సను నియామించింది కేంద్ర హోం శాఖ. 
 
అంతేకాదు నాలుగు సున్నిత ప్రాంతాల్లో “షూట్ ఎట్ సైట్” ఉత్తర్వులు కూడా జారీ చేసారు ఢిల్లీ పోలీసులు. ఈశాన్య ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇళ్లను వదిలి బయటకు రాకూడదంటూ మైకుల్లో ప్రకటనలు చేస్తున్నరు పోలీసులు.
 
అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో బుధవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా.
 
మరోవైపు టీవీ చానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ టీవీ చానెల్స్‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ కింద ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు ఈ క్రింది సూచనలు చేసింది. 
 
కీలక సూచనలు ఇవే..
 
 దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించ పర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో  ప్లే చేయకూడదు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తుల భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదు.. అని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో నిశితంగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం