Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ విజేతలు.. ఉత్తమ నటీ నటులు ఎవరు?

ఆస్కార్ విజేతలు.. ఉత్తమ నటీ నటులు ఎవరు?
, సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (09:40 IST)
హాలీవుడ్ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత కన్నులపండుగగా సాగుతోంది. ఈ 92వ అకాడ‌మీ వేడుక‌ల‌ల్లో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఈ వేడుకలో నటీమణులు రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోతున్నారు. ప్రపంచంలోని తారలందరు ఒకే చోట చేరడంతో ఆ ప్రాంగణం శోభాయమానంగా మారింది. 
 
'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' అనే చిత్రంలో నటించిన బ్రాడ్ పిట్‌కు ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే, ఉత్త‌మ యానిమేటెడ్ విభాగంలో టాయ్ స్టోరీ 4కు అవార్డు ద‌క్కింది. మ్యారేజ్ స్టోరీ చిత్రానికిగానూ లారా డ్రెన్‌కు ఉత్త‌మ‌న‌టి అవార్డ్ ద‌క్కింది. 
 
92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులని ప్రధానం చేస్తున్నారు. ఉత్తమ యానిమేటేడ్‌ షార్ట్‌ ఫిలింగా హెయిర్‌ లవ్‌ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ దక్కగా, ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్‌పిట్‌ (వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌), బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలింగా టాయ్‌ స్టోరీ చిత్రాలు అవార్డులని దక్కించుకున్నాయి. కాగా, ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం తొమ్మిది చిత్రాలు బ‌రిలో నిలిచాయి. వాటిలో జోక‌ర్, పారాసైట్‌, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్‌, లిటిల్ ఉమెన్‌, ఫోర్డ్ వర్సెస్‌  ఫెరారి, ఒన్స్  ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.
 
ఇప్పటివరకు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నవారి వివరాలు..
ఉత్త‌మ స‌హాయ న‌టుడు : బ్రాడ్‌పిట్‌(వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్త‌మ స‌హాయ న‌టి : లారా డ్రెన్‌(మ్యారేజ్ స్టోరీ)
ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే : బాంగ్ జూన్ హో(పారా సైట్‌)
ఉత్త‌మ అడాప్ట్ స్క్రీన్ ప్లే : తైకా వెయిటిటి(జో జో ర్యాబిట్‌)
ఉత్త‌మ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌ : హెయిర్ ల‌వ్‌
ఉత్త‌మ యానిమేటెడ్ ఫిల్మ్ ‌: టాయ్ స్టోరీ 4
ఉత్త‌మ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ ‌: వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన హాలీవుడ్
ఉత్త‌మ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : జాక్వెలిన్ దుర‌న్‌(లిటిల్ ఉమెన్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ - అమెరికన్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్ ‌- లారా డెర్న్‌(మ్యారేజ్‌ స్టోరీ)
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌ - ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ఫిల్మ్ ‌- ద నైబర్స్‌ విండో
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ - ఇఫ్‌ యూ ఆర్‌ ఏ గర్ల్‌
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ - 1917

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు నాకు తమ్ముడు లాంటోడు. బన్నీ ఎవరో తెలియదు.. షకీలా