Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకతాయిల వేధింపులు.. బస్సులో నుంచి కిందికి దూకేసిన ఢిల్లీ విద్యార్థిని

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (13:24 IST)
ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే ఓ యువతి బస్సులో నుంచి కిందికి దూకేసింది. బస్సులో అకతాయిల వేధింపులు తాళలేక ఈ పనికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసే ఓ యువతి ప్రతి రోజూ రూట్ నంబర్ 544లో ప్రయాణిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే అకతాయిల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గతంలో ఓ మారు వేధిస్తున్న విషయాన్ని ఇతర ప్రయాణికులకు చెప్పడంతో, ఆ ఆకతాయిని కిందకు దించేశారు. అయినా అతను వదల్లేదు. అదే మార్గంలో కనిపిస్తూ, ఆమెపై వేధింపులను మరింతగా పెంచారు. ఈ క్రమంలో తాజాగా అతనితో పాటు.. మరికొందరు అకతాయిలు ఆమెను వేధించారు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ యువతి బస్సులో నుంచి కిందికి దూకేసింది. 
 
ఈ విషయాన్ని ఆమె సోదరి సోషల్ మీడియాలో వెల్లడించింది. "నా సోదరి కొన్ని రోజులు వేరే మార్గాల్లో కాలేజీకి వెళ్లింది. రూట్ మారడం వల్ల కాలేజీకి అలస్యంగా చేరుకునేది. దీంతో తిరిగి 544 రూట్‌లోనే ప్రయాణం సాగిస్తోంది. చాలా మంది అమ్మాయిలు ఈ మార్గంలో వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకునే ఆకతాయిలు వేధింపులతో రెచ్చిపోతున్నారు. శనివారం నా సోదరి బస్సు నుంచి దూకేసి గాయాల పాలైంది. నీ గురించి మాకు మొత్తం తెలుసు. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా తెలుసు అంటుంటే భయపడింది" అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన ఆ ప్రాంత డీసీపీ విజయ్‌ కుమార్‌, ఈ మార్గంలో పోలీసుల నిఘాను పెంచి అమ్మాయిలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments