Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం: హస్తినలో హై అలర్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:37 IST)
దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని జరుపుకోబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి 55 పిస్తోళ్లు, 50 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్నించి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ క్యాట్రిడ్ద్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల సమీపించడం, భారీ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ఎర్రకోట వద్ద 5 వేలమంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలో ఎత్తైన భవనాలపై ఎస్ఎస్‌జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ద్రోన్లు, బెలూన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థ ఏర్పాటైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments