జాతక దోషం పేరుతో మేనకోడలిపై మేనమామ అత్యాచారం...

దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీల

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (16:02 IST)
జాతక దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీకి చెందిన 23 యేళ్ల యువతిపై ఆమె మేనమామ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలన్న కోర్కెతో... ఆమెను లోబరుచుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఆ యువతి జాతకంలో దోషం ఉందనీ, దాన్ని సరిచేయకుంటే తండ్రి ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ దోష నివృత్తితో పాటు తండ్రి ప్రాణాలు కాపాడాలంటే తాను చెప్పినట్టు వినాలని ఆదేశించాడు. 
 
దీంతో ఆ యువతి తండ్రి ప్రాణాలతో పాటు తన దోష నివృత్తి కోసం మేనమామ చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చింది. ఈ తంతు గత నాలుగేళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆ యువతికి ఓ వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ.. ఆ మేనమామ ఆ యువతిని విడిచిపెట్టలేదు. పైగా, పెళ్లయనప్పటికీ తన కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. దీంతో ఆ వివాహిత ధైర్యం చేసి అత్తింటి వారికి చెప్పింది. వారి సహాయంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments