Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద సమేత ట్రైలర్ అదుర్స్.. గంటల వ్యవధిలోనే 50లక్షల వ్యూస్

అరవింద సమేత సినిమా దసరాకు రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుత

Advertiesment
Aravindha Sametha
, బుధవారం, 3 అక్టోబరు 2018 (11:44 IST)
అరవింద సమేత సినిమా దసరాకు రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌ మొత్తం నందమూరి ఫ్యాన్స్‌ను భారీ స్థాయిలో ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డేతో లవ్ ట్రాక్, ఫ్యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ అంచనాలకు ధీటుగా వున్నాయి. అందుకే టీజర్ విడుదలైన గంటల్లోనే 50లక్షల వ్యూస్ వచ్చాయి. 
 
"మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?" అంటూ ఎన్టీఆర్‌ తనలోని సీమ పౌరుషాన్ని చూపించడం మాస్ ఆడియన్స్‌కు తెగ నచ్చేస్తోంది. చివరగా, "సార్‌... వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి" అంటూ భావోద్వేగంతో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది.
 
ఇకపోతే.. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ భావోద్వేగ స్పీచ్‌పై దర్శకుడు బాబీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఎన్టీఆర్ మాటలు పదేపదే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయన్నాడు. ప్రతిమాట ఎన్టీఆర్ హృదయంలో నుంచి రావడం వల్లనే అవి ప్రతి ఒక్కరి మనసులను తాకగలిగాయని చెప్పాడు. ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా తప్పకుండా బంపర్ హిట్ అవుతుందన్నాడు. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్ .. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్ ఎన్టీఆర్ అభిమానులకు కన్నుల పండుగ చేస్తుందని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌశల్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్... ఏంటది?