రెడ్డి ఇక్కడ చూడు లిరికల్ వీడియో రిలీజ్
						
		
						
				
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''అరవింద సమేత వీర రాఘవ''. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీ
			
		          
	  
	
		
										
								
																	యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''అరవింద సమేత వీర రాఘవ''. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. రోజుకో సర్‌ప్రైజ్ ఇస్తూ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తోంది. 
	
	 
	ఈ సినిమాలో కన్నడ భామ మేఘశ్రీ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించిందనేది తాజా సమాచారం. పలు కన్నడ చిత్రాలతో పాటు ఓమై గాడ్.. అనగనగా ఒక చిత్రం వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించింది. కాగా దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ సినిమాలోని ఏడ పోయినాడో.., అనగనగనగా, పెనివిటి, రెడ్డి ఇక్కడ సూడు అనే పాటలు శ్రోతల మనస్సును దోచేశాయి. తాజాగా రెడ్డి ఇక్కడ చూడు పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ లిరికల్ వీడియోలో పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అంజనా సౌమ్య, డాలెర్ ఈ పాటను పాడారు.