Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా జీవితం మీకు అంకితం.. భావోద్వేగంతో జూనియర్ ఎన్టీఆర్

''అరవింద సమేత'' సినిమా ప్రీ రిలీజ్ వేడుకగా హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకలో ఈ సినిమా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అభిమానుల కంటతడి పెట్టించాయి. 12

మా జీవితం మీకు అంకితం.. భావోద్వేగంతో జూనియర్ ఎన్టీఆర్
, బుధవారం, 3 అక్టోబరు 2018 (10:56 IST)
''అరవింద సమేత'' సినిమా ప్రీ రిలీజ్ వేడుకగా హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకలో ఈ సినిమా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అభిమానుల కంటతడి పెట్టించాయి. 12 సంవత్సరాల తన కల త్రివిక్రమ్‌తో సినిమా చేశాక పూర్తయ్యిందన్నారు. చాలాసార్లు అనుకున్నా ఇప్పుడే కుదిరిందని జూనియర్ తెలిపారు. ఎవరికైనా.. ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు... వాడే మొనగాడంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారు. 
 
మనకి జీవితంలో తెలిసో.. తెలియకో.. చాలామందితో బాధలు ఉంటాయి. గొడవలు ఉంటాయి. కానీ జీవితమంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం కాదు, జీవితమంటే బతకడం.. ఎలా బతకాలో చెప్పే సినిమా 'అరవింద సమేతవీర రాఘవ' అంటూ చెప్పుకొచ్చారు. మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా బతకాలో.. మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఎలా బతకాలో చెప్పే సినిమా ఇదని తెలిపారు. 
 
చాలా మంది ఈ టైటిల్ పెట్టినప్పుడు ఇదేంటి టైటిల్ పవర్ ఫుల్ లేదని అన్నారు.. ఒక మగాడి పక్క ఒక ఆడదాని కంటే బలం మరేదీ ఉండదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఒక దర్శకుడిని చూశాను.. ఒక స్నేహితుడ్ని చూశాను.. కానీ ఈ సినిమా పూర్తయ్యేలోపు ఒక ఆత్మబంధువుని చూశాను. తనకు ఎలాంటి కష్టమొచ్చినా అందరితో పాటు తన వెన్నంటి నిలిచిన వ్యక్తి త్రివిక్రమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. 
 
ఇక సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారని, జగపతిబాబు లేకపోతే అరవింద సమేత వీర రాఘవ లేదు. అరవింద సమేతకి మరో స్ట్రాంగ్ పిల్లర్ నవీన్. "ఒక నెల రోజుల నుండి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. ఎలా మాట్లాడాలో..? ఎలా చెప్పాలో..? తెలియడం లేదు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. 
 
ఒక  తండ్రికి అంత అద్భుతమైన కొడుకు ఉండడు.. ఒక కొడుకుకి అంత అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంత అధ్బుతమైన భర్త ఉండడు.. ఒక మనవడికి అంత అద్భుతమైన తాత ఉండడు. బ్రతికున్నంత వరకు ఎన్నో సార్లు మాకు చెప్పేవారు.. ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు.. ఆరోజు నుండి మనల్ని మోస్తున్నది వీళ్లే (అభిమానులు). 
 
అభిమానులు జాగ్రత్త అని ఎన్ని సార్లు అన్నారో తనకు తెలుసునని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మా నాన్నకిచ్చిన మాటే మీకిస్తున్నాను మా జీవితం మీకు అంకితం'' అని వెల్లడించారు. తన కెరీర్‌లో ఎప్పుడూ తండ్రికి చితికి నిప్పంటించే సన్నివేశం లేదని.. యాదృచ్ఛికమో ఏమో కానీ.. అది ఈ సినిమాలో వుందని.. అలాగే తన నిజజీవితంలోనూ జరిగిపోయిందని భావోద్వేగంతో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

జూనియర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి.. ఎన్టీఆర్ స్పీచ్ పట్ల అభిమానులు తామున్నామని.. భావోద్వేగానికి లోనుకాకండంటూ సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నోటా' నొక్కాలని చెప్పడం లేదు.. కానీ యువ సీఎంను చూస్తారు : విజయ్ దేవరకొండ